Donald Trump: అమెరికాలో మళ్లీ స్వర్ణయుగం మొదలైంది.. తొలి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్

Once again golden era to America says USA new president Donald Trump
  • అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
  • ‘అమెరికా ఫస్ట్’ అనేదే తన నినాదమన్న నూతన అధ్యక్షుడు
  • తుపాకి కాల్పుల నుంచి బయటపడిన తాను దేశానికి అత్యుత్తమ సేవలు అందిస్తానని స్పష్టీకరణ
  • పనామా కెనాల్‌ను వెనక్కి తీసుకుంటామన్న ట్రంప్
  • గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పిలుస్తామని స్పష్టీకరణ
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అనంతరం ప్రసంగిస్తూ అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని అన్నారు. అమెరికా ఫస్ట్ అనేదే తన నినాదమని, దేశం అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. అమెరికాలో నేటి నుంచి స్వర్ణయుగం మొదలైందని, ఇక నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవాన్ని పొందుతుందని అన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు.శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

దేవుడి దయవల్ల తుపాకి కాల్పుల నుంచి బయటపడిన తాను దేశ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తానని ట్రంప్ వివరించారు. అక్రమ వలసలు అరికడతామని, దేశంలోకి నేరగాళ్లు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెస్టారెంట్లలో యథేచ్ఛగా జరుగుతున్న కాల్పుల ఘటనలను ప్రస్తావిస్తూ ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

పనామా కెనాల్ ఒప్పందాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయని, కాబట్టి దానిని వెనక్కి తీసుకుంటామని ట్రంప్ తేల్చి చెప్పారు. అలాగే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పారు. ప్రతిభావంతులకు తమ ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేసిన ట్రంప్.. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
Donald Trump
USA
47th President
America First

More Telugu News