Kolkata: సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చడంపై స్పందించిన ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
- ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు కాదన్న బాధితురాలి తల్లి
- ఇతర నేరస్థులను అరెస్ట్ చేసి శిక్షించే వరకు న్యాయం కోసం ఎదురు చూస్తామని వ్యాఖ్య
- తాము జీవించి ఉండే చివరి రోజు వరకు న్యాయం కోసం ఎదురు చూస్తామన్న తల్లి
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో సంజయ్ రాయ్‌ని కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి తల్లి స్పందించారు. ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు కాదని, నేరానికి పాల్పడిన మిగతా వారిని ఇంకా అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ సహచరులు, ఇతర నేరస్థులను అరెస్ట్ చేసి శిక్షించే వరకు న్యాయం కోసం తాము ఎదురు చూస్తామన్నారు.
సంజయ్ దోషి అని జీవసంబంధమైన ఆధారాల ద్వారా నిరూపితమైందన్నారు. కోర్టులో విచారణ సమయంలో అతను మౌనంగా ఉన్నాడని, తన కూతురును హింసించి చంపడంలో అతడి పాత్రను ఇది నిరూపించిందన్నారు. కానీ ఈ ఘటనలో అతను కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసే వరకు తమకు న్యాయం జరగనట్లే అన్నారు. తాను, తన భర్త జీవించే చివరి రోజు వరకు న్యాయం కోసం ఎదురు చూస్తామన్నారు.
కేసు పూర్తి కాలేదని, తమ కూతురు హత్యాచారంలో పాల్గొన్న ఇతర నిందితులకు శిక్ష పడిన తర్వాత మాత్రమే ఇది పూర్తవుతుందన్నారు. తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు నిద్రపోలేమన్నారు. తాము కోరుకునేది న్యాయం మాత్రమే అన్నారు.