G. Kishan Reddy: ఇది కొత్తదేం కాదు... ఆ చట్టానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని పేరు పెట్టింది: కిషన్ రెడ్డి

Kishan Reddy alleges congress government is not giving salaries
  • చెరువుల ఆక్రమణను అరికట్టే చట్టం గతంలోనూ ఉందన్న కిషన్ రెడ్డి
  • గ్రామాల్లో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్న కేంద్రమంత్రి
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని వ్యాఖ్య
చెరువుల ఆక్రమణను అరికట్టే చట్టం గతంలోనూ ఉందని, పాత చట్టానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని పేరు పెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శించారు. ఏడు నెలలుగా జీహెచ్ఎంసీ పరిధిలో వీధిలైట్ల నిర్వహణకు నిధులు రావడం లేదన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కొనసాగిస్తోందన్నారు. మెట్రో రైల్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందుతోందన్నారు. ఇది తమ బాధ్యత అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందన్నారు.
G. Kishan Reddy
Telangana
Revanth Reddy
HYDRA

More Telugu News