Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ కు నిధులు వచ్చాయి... ఇక చేయాల్సింది ఇదే!: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana opines on special package for Vizag Steel Plant
  • విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ
  • కేంద్రం ప్రకటన పట్ల ఏపీలో సర్వత్రా హర్షం
  • ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ లక్ష్మీనారాయణ ట్వీట్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం పట్ల సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. 

విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని... అదే సమయంలో విశాఖ ఉక్కును కాపాడేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు అభినందనీయమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 

"స్టీల్ ప్లాంట్ కు నిధులు వచ్చాయి. ఇక రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎన్ఐఎల్-విశాఖ స్టీల్ ప్లాంట్) యాజమాన్యం, కార్యనిర్వాహక అధికారులు, కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిశ్రమ అభ్యున్నతికి కృషి చేయాలి. వృత్తిగత నిబద్ధతను చాటుతూ, ఉక్కు పరిశ్రమను పూర్తిస్థాయి సామర్థ్యంతో పరుగులు తీయించాలి. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా... విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయడం, లేదా, విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించడం వల్లనే సత్ఫలితాలు వస్తాయి" అని లక్ష్మీనారాయణ వివరించారు.
Vizag Steel Plant
Special Package
VV Lakshminarayana
Andhra Pradesh

More Telugu News