Newborn: మిరాకిల్ అంటే ఇదేనేమో... ఆగిన ప‌సిగుడ్డు గుండె... సీపీఆర్ చేయ‌డంతో బ‌తికిన వైనం!

Newborn Childs Heart Beat That Stopped It Suddenly Came Back To Life after CPR
    
అప్పుడే పుట్టిన బిడ్డ‌కు 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఘ‌ట‌న మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెద‌క్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో పుట్టిన పాప ఊపిరి ఆడ‌క ఇబ్బంది ప‌డింది. దీంతో 108 వాహ‌నంలో హైద‌రాబాద్‌లోని నిలోఫ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు వైద్యులు. 

అయితే, అలా ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌ంలో చిన్నారి గుండె ఆగిపోయింది. అంబులెన్స్ టెక్నీషియ‌న్ రాజు వెంట‌నే సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడారు. అనంత‌రం హైద‌రాబాద్ ఆసుప‌త్రిలో చేర్పించారు. ప్ర‌స్తుతం పాప ఆరోగ్యంగా ఉంది. స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించిన అంబులెన్స్ టెక్నీషియ‌న్ రాజును వైద్యులు, అధికారులు అభినందించారు. అటు చిన్నారి పేరెంట్స్ కూడా రాజుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.  
Newborn
CPR
Heart Beat
Medak District
Telangana

More Telugu News