Megastar: ఇంటర్నేషనల్ లీగ్ టీ20.. షార్జా స్టేడియంలో మెగాస్టార్ చిరు సందడి.. వీడియో ఇదిగో!

Megastar Chiranjeevi graced the Sharjah Cricket Stadium to watch DPWorldILT20
  • యూఏఈలో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 
  • ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్‌కుమార్‌తో కలిసి మ్యాచ్ చూసిన చిరు
  • వీడియోను ఎక్స్ ఖాతాలో పంచుకున్న ‘ఐఎల్ టీ20’
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (డీపీ వరల్డ్ ఐఎల్ టీ20)లో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధితో కలిసి షార్జా స్టేడియంలో నిన్న దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకించారు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పంచుకుంది. ఈ వీడియోను చూసి మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. 

ఇక, దుబాయ్ కేపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో షార్జా వారియర్జ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ కేపిటల్స్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. షాయ్ హోప్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన షార్జా వారియర్జ్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్కా ఫెర్నాండో 27 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు.
Megastar
Chiranjeevi
International League T20
Sharjah

More Telugu News