Kadiam Srihari: కల్వకుంట్ల కుటుంబంలో అందరిపై కేసులు ఉన్నాయి: కడియం శ్రీహరి

Kadiayam srihari says all the leaders in Kalvakuntla family have cases
  • కాంగ్రెస్ అధికారంలో ఉండటాన్ని కల్వకుంట్ల కుటుంబం ఓర్వలేకపోతోందని విమర్శ
  • కేటీఆర్ మీద పెట్టింది లొట్టపీసు కేసైతే ఏసీబీ, ఈడీ ఎందుకు వచ్చాయని ప్రశ్న
  • ఢిల్లీలో తెలంగాణ పరువు తీశారని విమర్శ
కల్వకుంట్ల కుటుంబంలో అందరిపై కేసులు ఉన్నాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అయిందని, కానీ బీఆర్ఎస్ మాత్రం ఓర్వలేకపోతోందని మండిపడ్డారు.

తమపై ఉన్న కేసుల గురించి కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదన్నారు. పార్ములా ఈ-రేసింగ్ కేసులో ఆర్బీఐ అనుమతులు లేకుండా డబ్బులు మళ్లించారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పెట్టింది లొట్టపీసు కేసే అయితే ఏసీబీ, ఈడీ ఎందుకు వచ్చాయో చెప్పాలన్నారు.

మద్యం పాలసీ, ఫార్ములా ఈ-రేసింగ్ వంటి కేసులతో ఢిల్లీలో తెలంగాణ పరువును తీశారని ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో కేసీఆర్ 'నీకది-నాకిది' అనే తీరులో వ్యవహరించారని ఆరోపించారు. కేటీఆర్‌కు బాండ్ల రూపంలో రూ.40 కోట్లు తిరిగి వచ్చాయన్నారు.
Kadiam Srihari
Telangana
BRS
KCR

More Telugu News