ఖమ్మం జిల్లాలో క్రికెట్ ఆడుతూ మైదానంలో కుప్పకూలిన యువకుడు
- కూసుమంచి జిల్లాలో ఘటన
- మైదానంలో కుప్పకూలిన విజయ్ అనే యువకుడు
- గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు
ఈ టోర్నమెంట్‌లో విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దీంతో నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో టోర్నమెంట్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.