Virat Kohli: త్వ‌ర‌లో అలీబాగ్ ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం చేయ‌నున్న విరుష్క జంట‌.. ఈ కొత్త విల్లా కోసం ఎంత వెచ్చించారో తెలిస్తే..!

Virat Kohli and Anushka Sharma To Host Housewarming Ceremony At Alibaug Home Preparation Video Goes Viral
  • అలీబాగ్ ఇంటి కోసం రూ.32 కోట్లు ఖర్చు చేసిన కోహ్లీ దంప‌తులు
  • 10వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో సువిశాల‌మైన విల్లా
  • ఇది కాలిఫోర్నియా కొంకణ్ తరహా నాలుగు పడక గదుల విల్లా
టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తులు త్వ‌ర‌లోనే కొత్త ఇంట్లోకి ‌మారనున్నారు. అలీబాగ్‌లో నిర్మించిన ఇల్లు అందుకు సిద్ధ‌మ‌వుతోంది. సిబ్బంది ఆ ఇంటిని పూలు, లైట్ల‌తో అందంగా అలంక‌రిస్తున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. కోహ్లీ దంప‌తులు ముంబ‌యి నుంచి బుధవారం నాడు తమ నూతన గృహ ప్రవేశం కోసం అలీబాగ్‌కు వెళ్లారు. 

కాగా, విరాట్ కోహ్లి, అనుష్క శర్మల అలీబాగ్ ఇంటికి రూ.32 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ఈ జంట 2022లో అలీబాగ్‌లో రూ. 19కోట్లు వెచ్చించి ఇంటి స్థ‌లం కొనుగోలు చేసింది. ఇంటి నిర్మాణానికి మరో రూ.13 కోట్లు వెచ్చించారు. 10వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో సువిశాల‌మైన విల్లా, స్విమ్మింగ్ పూల్ స‌హా గార్డెన్ ఏర్పాటు చేయించుకుంది విరుష్క జంట‌. 

ఈ విల్లాలో ఉష్ణోగ్రత నియంత్రిత స్విమ్మింగ్ పూల్, బెస్పోక్ కిచెన్, నాలుగు బాత్‌రూమ్‌లు, జాకుజీ, విశాలమైన గార్డెన్, కవర్ పార్కింగ్, స్టాఫ్ క్వార్టర్స్ ఇలా ఎన్నో సౌక‌ర్యాలు ఉన్నాయి. ఈ ఇంటిని ఫిలిప్ ఫౌచే నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్కిటెక్ట్‌లు డిజైన్ చేశారు. ఇది కాలిఫోర్నియా కొంకణ్ తరహా నాలుగు పడక గదుల విల్లా.
Virat Kohli
Anushka Sharma
Alibaug Home
Housewarming Ceremony
Team India

More Telugu News