Daaku Maharaaj: 'డాకు మ‌హారాజ్' 2 రోజుల వ‌సూళ్లు ఇవే.. అధికారికంగా ప్ర‌క‌టించిన నిర్మాణ సంస్థ‌

Daaku Maharaaj Collects Above Rs 74 Crore Gross Worldwide in Two Days
  • బాల‌కృష్ణ, బాబీ కాంబినేష‌న్ లో 'డాకు మ‌హారాజ్'
  • ఈ నెల 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన సినిమా
  • రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.74 కోట్ల‌కు పైగా గ్రాస్ 
  • మొద‌టి రోజు రూ.56 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్
నంద‌మూరి బాల‌కృష్ణ, బాబీ కొల్లి కాంబినేష‌న్ లో వ‌చ్చిన 'డాకు మ‌హారాజ్' మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.74 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌చ్చిన‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తాజాగా ప్ర‌క‌టించింది. 

ఈ సంక్రాంతికి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన డాకు మ‌హారాజ్‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంద‌ని పేర్కొంది. అలాగే అభిమానుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపింది. కాగా, ఈ సినిమాకు మొద‌టి రోజైన ఆదివారం నాడు రూ.56 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 
Daaku Maharaaj
Balakrishna
Tollywood

More Telugu News