Telangana: తెలంగాణకు నరేంద్రమోదీ ప్రభుత్వం శుభవార్త!

National Turmeric board at Nizamabad district
  • నిజామాబాద్ వాసులకు నరేంద్రమోదీ సంక్రాంతి కానుక
  • నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియామకం
తెలంగాణ ప్రజలకు.. ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు ప్రధాని నరేంద్రమోదీ సంక్రాంతి కానుక ఇచ్చారు. నిజామాబాద్ వాసులు ఏళ్ల తరబడి పసుపు బోర్డు కోసం కలలు కంటున్నారు. ఇప్పుడు ఇది సాకారమైంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం నాడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనుంది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు.
Telangana
BJP
Narendra Modi

More Telugu News