KTR: భోగి వేడుకల్లో కేటీఆర్, హరీశ్ రావు, కవిత.. ఫొటోలు ఇవిగో!

KTR and Kavitha in Bhogi celebrations
  • ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో భోగి వేడుకలు
  • హాజరైన కేటీఆర్, హరీశ్, కౌశిక్ రెడ్డి తదితరులు
  • కేబీఆర్ పార్క్ వద్ద వేడుకల్లో పాల్గొన్న కవిత
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో భోగి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ సంస్కృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... హైదరాబాద్ నడిబొడ్డున పల్లె వాతావరణాన్ని సృష్టించి భోగి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. భోగి అంటేనే ప్రతికూలతలను విడిచిపెట్టి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లడమని అన్నారు. 
KTR
Harish Rao
K Kavitha
BRS

More Telugu News