ట్రక్‌ను ఢీకొట్టిన టెంపో .. 8 మంది దుర్మరణం
- నాసిక్ ముంబయి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- ఆరుగురు స్పాట్‌లో, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి
- జిల్లా ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరిని జిల్లా ఆసుపత్రికి, మరి కొందరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.