YS Abhishek Reddy: వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

YS Abhishek Reddy passes away
  • అనారోగ్యంతో మృతి చెందిన అభిషేక్ రెడ్డి
  • భౌతికకాయాన్ని పులివెందులకు తరలిస్తున్న కుటుంబ సభ్యులు
  • రేపు ఉదయం పులివెందులలో అంత్యక్రియలు
వైసీపీ నేత, వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాసేపటి క్రితం ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వైసీపీ అధినేత జగన్ కు అభిషేక్ రెడ్డి బంధువు అవుతారు. అభిషేక్ రెడ్డి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు పులివెందులకు తరలిస్తున్నారు. పులివెందులలో రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో జగన్, ఆయన భార్య భారతి పాల్గొననున్నారు.
YS Abhishek Reddy
YSRCP
Jagan

More Telugu News