Bhumana Karunakar Reddy: తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలి: భూమన

Chandrabu should take responsibility for Tirupati stampade says Bhumana
  • తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురి మృతి
  • పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విఫలమయ్యారన్న భూమన
  • మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కౌంటర్ల వద్ద నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోరని, తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని అన్నారు. 

పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందునే తొక్కిసలాట జరిగిందని భూమన ఆరోపించారు. తొక్కిసలాట సమయంలో అక్కడ పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరని అన్నారు. టీటీడీ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. టీటీడీని ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చేశారని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ విషయంలో జగన్, వైసీపీపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తిరుమలను, దేవుడిని చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటారని దుయ్యబట్టారు.
Bhumana Karunakar Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News