Ambulance: శ్రీవారి భక్తులను ఢీకొట్టిన అంబులెన్స్.. ఇద్దరి మృతి

Ambulance Hit Two Women Devotees Dead In Tirupati District
  • తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ప్రమాదం
  • శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వెళుతుండగా ఘోరం
  • మృతులు అన్నమయ్య జిల్లా చెంపాలపల్లి వాసులు
శ్రీవారి దర్శనం కోసం కాలినడకన బయలుదేరిన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మహిళా భక్తులపైకి దూసుకువెళ్లింది. దీంతో ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు నుంచి కాలినడకన తిరుమలకు వెళుతున్న భక్తులను మదనపల్లె నుంచి తిరుపతికి రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్ (108 వాహనం) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన శ్రీవారి భక్తులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ(40), లక్ష్మమ్మ(45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురు భక్తులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
Ambulance
Tirumala
Tirupati
Devotees
Two Dead
Chandragiri

More Telugu News