KTR: లీగల్ టీమ్ తో కలిసి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరిన కేటీఆర్

KTR reaches ACB office
  • ఫార్ములా ఈ-కార్ కేసులో ఏసీబీ విచారణ
  • ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న విచారణ
  • కేటీఆర్ స్టేట్మెంట్ ను నమోదు చేయనున్న ఏసీబీ అధికారులు
ఫార్ములా ఈ-కార్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. నంది నగర్ లోని నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి పయనమయ్యారు. ఆయనతో పాటు ఆయన లీగల్ టీమ్ కూడా ఉంది. కేటీఆర్ విచారణకు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధం చేశారు. ఏసీబీ అధికారులు కేటీఆర్ స్టేట్మెంట్ ను నమోదు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ వాహనాన్ని మాత్రమే ఏసీబీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించనున్నారు. ఈ ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ విచారణ ప్రారంభమవుతుంది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ ను విచారించనున్నట్టు సమాచారం.
KTR
BRS
Formula E Car Case
ACB

More Telugu News