Rythu Bharosa: రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామంటూ కోత పెట్టారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman slams Telangana Congress govt over Rythu Bharosa
  • కాంగ్రెస్ పాలనలో అన్నీ కోతలు, ఎగవేతలేనన్న లక్ష్మణ్
  • మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం
  • రైతు భరోసాలో కౌలు రైతుల ఊసేలేదని విమర్శలు 
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నీ కోతలు, ఎగవేతలేనంటూ బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామంటూ, అందులో కోత పెట్టారని ఆరోపించారు. మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని, రైతు భరోసాలో కౌలు రైతుల ఊసేలేదని లక్ష్మణ్ విమర్శించారు. రైతుల డేటా మొత్తం అందుబాటులో ఉన్నప్పుడు, మళ్లీ సర్వేలు ఎందుకని కాంగ్రెస్ సర్కారును నిలదీశారు. కాంగ్రెస్ అంటేనే మోసానికి నిర్వచనం అని మరోసారి నిరూపితమైందని అన్నారు.
Rythu Bharosa
MP Laxman
BJP
Congress
Telangana

More Telugu News