Rythu Bharosa: ఈ నెల 26 నుంచి రైతు భరోసా అందిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar said Rythu Bharosa will be implemented from Jan 26
  • రైతు భరోసా ఎగ్గొట్టారంటూ విపక్షాల విమర్శలు
  • స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
  • రైతు భరోసా మొత్తాన్ని కూడా రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామన్న పొన్నం
  • కొత్త రేషన్ కార్డులు  ఇస్తామని వెల్లడి 
రైతు భరోసా పథకానికి మంగళం పాడారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అందిస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా, రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతు భరోసా నగదును పెంచామని పొన్నం వివరించారు. 

ఇక, గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా జరుగుతోందని, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం జరుగుతుందని మంత్రి పొన్నం చెప్పారు.
Rythu Bharosa
Ponnam Prabhakar
Congress
Telangana

More Telugu News