China: చైనాలో పిల్లులకు ప్రాణాంతక వైరల్ వ్యాధి.. కొవిడ్ టాబ్లెట్లు వేస్తున్న చైనీయులు

A new virus Feline Infectious Peritonitis for cats in China
  • ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్ అనే వైరల్‌ వ్యాధి బారినపడుతున్న పిల్లులు
  • చికిత్స కోసం పెంపుడు పిల్లులకు కొవిడ్ మందులు వేస్తున్న యజమానులు 
  • రేటు తక్కువగా ఉండడమే కారణమంటున్న మీడియా కథనాలు
ప్రాణాంతక వైరస్‌లు, వ్యాధులకు పుట్టినిల్లు అయిన చైనాలో ప్రస్తుతం పిల్లులు ప్రాణాంతకమైన ‘ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్’ అనే వైరల్‌ వ్యాధి బారినపడుతున్నాయి. ఫీలైన్ కరోనా వైరస్ అని కూడా పిలిచే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ పిల్లులకు మాత్రమే సోకుతుంది. ఈ వైరస్ శరీరం అంతటా వ్యాపిస్తుంది. క్రమక్రమంగా తెల్ల రక్త కణాలకు సోకి ప్రాణాంతకంగా మారుతుంది.

పిల్లులకు సంక్రమిస్తున్న ఈ వైరస్ పట్ల పెంపకందార్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి సోకకుండా, సోకిన తర్వాత చికిత్సలో చాలామంది యజమానులు కొవిడ్ వైద్యంలో వినియోగించే మందులను పిల్లులకు వేస్తున్నారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా ‘ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్’ చికిత్సకు వాడే మెడిసిన్స్ ధరలు చాలా ఎక్కువుగా ఉంటాయి. అందుకే కొవిడ్ మందుల వినియోగానికి చైనీయులు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొవిడ్‌ యాంటీ వైరల్‌ మందులు కూడా ‘ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్’ వ్యాధి చికిత్సలో ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతుండడంతో కొవిడ్ మందుల వైపే యజమానులు మొగ్గుచూపుతున్నారు. దీంతో, కొవిడ్‌ మందుల అమ్మకాలు అక్కడ జోరుగా సాగుతున్నాయి. కొవిడ్ మందులతో పిల్లులు కోలుకుంటున్నాయని చైనీయులు చెబుతున్నారు. మరోపక్క, చైనాలో హెచ్‌ఎంపీవీ అనే మరో కొత్త వైరస్‌ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.
China
Cats
Viral News
HMPV

More Telugu News