Telangana: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు... ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం: టీజీఆర్టీసీ

TGSRTC 6 special buses on Sankranthi festival
  • 6,432 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడి
  • 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం
  • రోజువారీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని వెల్లడి
  • ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీ వసూలు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది.

ఈ పండుగ రోజుల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. రోజువారీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
Telangana
TGSRTC
Sankranti
Makar Sankranti

More Telugu News