Hyderabad: సీరియల్ నటికి వేధింపులు... నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad police arrested man for misbehaving with woman
  • యూసఫ్‌గూడలో ఉంటున్న సీరియల్ నటి
  • ఫణితేజ అనే వ్యక్తితో పరిచయం
  • పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన తీసుకొచ్చిన నిందితుడు
  • నిరాకరించడంతో అసభ్యకర సందేశాలు పంపిన నిందితుడు
  • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
టీవీ సీరియల్ నటిని వేధిస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ యూసుఫ్‌గూడ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి ఉంటోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ సీరియల్‌లో చేస్తున్న సమయంలో ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది.

పెళ్లి చేసుకుంటానని రెండు నెలల క్రితం అతను చెప్పాడు. ఆమె మాత్రం తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి పెళ్లికి నిరాకరించింది. ఆరోజు నుంచి నిందితుడు ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. అసభ్యకర సందేశాలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపిస్తూ వేధించాడు.

బాధితురాలి అత్త ఇంటి చిరునామా తెలుసుకొని అక్కడకు వెళ్లి ఆమె గురించి చెడుగా చెప్పాడు. అతని వేధింపులు భరించలేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలియడంతో అతను ఆమెకు ఓ సెల్ఫీ వీడియోను పంపించాడు. తన వల్లే ఇదంతా జరిగిందని అందులో పేర్కొన్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Hyderabad
Crime News
Telangana

More Telugu News