Jagdeep Singh: ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకుంటున్నది ఎవరంటే..!

Who is taking high salary in the world
  • అత్యధిక వేతనం అందుకుంటున్నది భారతీయుడే
  • క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు జగ్దీప్ సింగ్ వార్షిక వేతనం రూ. 17,500 కోట్లు
  • రోజుకు రూ. 48 కోట్లు అందుకుంటున్న జగ్దీప్ సింగ్
ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే వ్యక్తి ఎవరనే సందేహం చాలా మందిలో ఉంటుంది. 'అన్ స్టాప్' అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎక్కువ వేతనం పొందుతున్నది భారతీయుడే కావడం మనకు గర్వకారణం. 'క్వాంటం స్కేప్' వ్యవస్థాపకుడు, సీఈవో జగ్దీప్ సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనాన్ని అందుకుంటున్నారు. 

జగ్దీప్ సింగ్ నెలవారీ జీతం రూ. 1,458 కోట్లు... వార్షిక జీతం రూ. 17,500 కోట్లుగా ఉంది. అంటే ఒక రోజుకు రూ. 48 కోట్లు ఆయన అందుకుంటున్నారన్నమాట. జగ్దీప్ సింగ్ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు. క్వాంటం స్కేప్ కంపెనీని స్థాపించక ముందు వివిధ కంపెనీల్లో కీలక పదవుల్లో పని చేశారు.
Jagdeep Singh
Highest salary

More Telugu News