Kadapa District: న్యూఇయర్ వేడుకల్లో విషాదం .. ఇద్దరి మృతి

tragedy took place during the new year celebrations in kadapa district two died
  • కల్వర్టును ఢీ కొట్టి బోల్తా పడిన స్కార్పియో కారు
  • న్యూ ఇయర్ వేడుకలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం
  • సింహాద్రిపురంకు చెందిన ఇద్దరు యువకుల మృతి 
న్యూ ఇయర్ వేడుకల వేళ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గండికోటకు వెళుతున్న ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల గ్రామం వద్ద జరిగింది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఏడుగురు యువకులు మంగళవారం న్యూ ఇయర్ వేడుకలకు గండికోటకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొట్టి బొల్తా కొట్టింది. 

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురుని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు యువకుల మృతితో సింహాద్రిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Kadapa District
Crime News
Road Accident

More Telugu News