pakistan border: ప్రేమ కోసం సరిహద్దులు దాటి పోలీసులకు చిక్కాడు!

up man illegally crosses pakistan border to meet lover he met online and arrested
  • ఫేస్‌బుక్‌లో పరిచయంతో పాక్ యువతి ప్రేమలో పడ్డ ఉత్తరప్రదేశ్‌ యువకుడు
  • బాదల్ బాబు ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి పాక్ పోలీసులకు చిక్కిన వైనం
  • బాదల్ బాబు అక్రమ చొరబాటుపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పాక్ పోలీసులు
ప్రియురాలి కోసం ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటి పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగఢ్‌కు చెందిన 30 ఏళ్ల యువకుడు బాదల్ బాబుకు పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ప్రియురాలిని కలుసుకునేందుకు బాదల్ బాబు ఇండియా – పాక్ సరిహద్దును దాటి ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. దీంతో అక్కడి పోలీసులు మండి బహుద్దీన్ పట్టణంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

అక్కడి చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. ఈ ఘటన డిసెంబర్ 27న జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాదల్ బాబు అక్రమ ప్రవేశంపై పాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాదల్ బాబు పాక్ రావడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా ? లేక దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

అయితే బాదల్ బాబు పాక్ వెళ్లేందుకు ప్రయత్నించడం ఇది తొలి సారి కాదు. గతంలో రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మూడో సారి విజయవంతంగా ప్రియురాలి వద్దకు చేరుకున్నప్పటికీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. 
pakistan border
arrest
national news
lover arrested

More Telugu News