Ayyanna Patrudu: న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు రావొద్దు.. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

AP Speaker Ayyanna Want To Away From New Year Celebrations
    
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేళ శుభాకాంక్షలు చెప్పేందుకు తన వద్దకు ఎవరూ రావొద్దని కోరారు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మృతి నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. 

డాక్టర్ మన్మోహన్ మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ లోపే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవడం సరికాదని భావించిన శాసన సభాపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1న తనను వ్యక్తిగతంగా కలిసేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
Ayyanna Patrudu
Andhra Pradesh
Telugudesam
New Year 2025

More Telugu News