Jasprit Bumrah: ఆస్ట్రేలియా బ్యాటర్ల భరతం పడుతున్న బుమ్రా.. భారత్ వైపు తిరుగుతున్న మ్యాచ్!

star pacer Jasprit Bumrah is on fire and Australias troubling
  • రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోతున్న ఆసీస్ బ్యాటర్లు
  • 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు
  • 4 వికెట్లతో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రా
  • 2 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్
  • ప్రస్తుతానికి 204 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారబోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 116 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించిన ఆతిథ్య జట్టు బ్యాటర్లను టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బెంబేలెత్తిస్తున్నాడు. 39 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 99 పరుగుల స్వల్ప స్కోరుకే 6 వికెట్లు కోల్పోయింది.

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. 4 వికెట్లతో చెలరేగాడు. మిగిలిన రెండు వికెట్లు మహ్మద్ సిరాజ్ పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లలో సామ్ కొంస్టాస్ 8, ఉస్మాన్ ఖవాజా 21, మార్నస్ లబూషేన్ 46 (ప్లేయింగ్), స్టీవెన్ స్మిత్ 13, ట్రావిస్ హెడ్ 1, మిచెల్ మార్ష్ 0, అలెక్స్ క్యారీ 2, ప్యాట్ కమ్మిన్స్ 4 (ప్లేయింగ్) పరుగులు చేశారు.

ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 204 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిగిలిన నాలుగు వికెట్లను కూడా త్వరగా పడగొడితే భారత్ ముందు సులభమైన లక్ష్యం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Jasprit Bumrah
India Vs Australia
Cricket
Sports News

More Telugu News