Cherukumalli Srinivasarao: భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ పదవిలో తొలిసారిగా తెలుగు వ్యక్తి

Cherukumalli Srinivasarao takes charge as Director to IARI
  • ఐఏఆర్ఐ డైరెక్టర్ గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియామకం
  • నేడు బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు
  • చెరుకుమల్లి శ్రీనివాసరావు స్వస్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా అనిగండ్లపాడు గ్రామం
భారత వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) డైరెక్టర్ గా తొలిసారి ఓ తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. ఐఏఆర్ఐ డైరెక్టర్ గా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నేడు ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. 

చెరుకుమల్లి శ్రీనివాసరావు స్వస్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా అనిగండ్లపాడు గ్రామం. ఆయన 1965 అక్టోబరు 4న జన్మించారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఢిల్లీలో అగ్రికల్చరల్ ఎమ్మెస్సీ, పీహెచ్ డీ పూర్తి చేశారు. 

ఉన్నత విద్యాభ్యాసం అనంతరం పలు పరిశోధన సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్ మెంట్ (నార్మ్) డైరెక్టర్ గా ఉన్నారు.
Cherukumalli Srinivasarao
Director
IARI
Andhra Pradesh

More Telugu News