Viral Videos: ఈ జింకల తెలివి చూశారా? నోరెళ్లబెట్టే వైరల్ వీడియోలు ఇవిగో!

A Deer in Japan politely waiting for traffic to stop before crossing
  • వాహనాలు ఆగిపోయే దాకా వేచి ఉండి రోడ్డు దాటిన ఒక జింక
  • సూపర్ మార్కెట్ తలుపు దగ్గరికి వెళ్లి... ఆహారం పెట్టాలంటూ మర్యాద పూర్వక సంకేతాలు చేసిన మరో జింక
  • వేటగాడి వద్దకే వచ్చి మనసు కరిగించిన ఇంకో జింక
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు
జపాన్‌ అంటేనే క్రమశిక్షణకు పెట్టింది పేరు. అక్కడి ఆఫీసులలోనే కాదు రోడ్ల మీద కూడా ప్రజలు రూల్స్‌ ను కచ్చితంగా పాటిస్తుంటారు. ప్రభుత్వం కూడా అంతే. ఏదైనా రైలు రెండు నిమిషాలు లేటుగా వచ్చినా, లేటుగా గమ్యస్థానానికి చేరుకున్నా కూడా తమ ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తుంది మరి. అలాంటి జపాన్‌ లోని నారా నగరంలోని జింకలకు ఈ క్రమశిక్షణ అలవడినట్టుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ఒక వీడియోలో జింక రోడ్డు దాటేందుకు ట్రాఫిక్‌ ఆగిపోయే వరకు వేచి ఉండి... ఆ తర్వాతే మెల్లగా రోడ్డు దాటింది.
మరో వీడియోలో జింక ఓ వేటగాడి దగ్గరికి వచ్చి నిల్చుంది. అమాయకంగా అది చూసిన చూపులకు కరిగిపోయిన వేటగాడు... దాన్ని నిమిరి వదిలేశాడు. ఆ తర్వాత చెంగుమని దూకుతూ వెళ్లిపోయింది.
ఇంకో వీడియోలో జింకలు ఒక సూపర్‌ మార్కెట్‌ వద్దకు వెళ్లి తలుపు ముందు నించున్నాయి. తమకు ఆహారం ఇవ్వాలన్నట్టుగా సంకేతం ఇస్తూ, జపాన్‌ వారు కాస్త ముందుకు వంగి పలకరించుకునేలా తల వంచుతూ నిలబడ్డాయి.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఆ జింకలు మనుషులకన్నా బెటర్ కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది వాటి తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వైరల్‌ వీడియోలను ఈ కింద చూడండి
Viral Videos
offbeat
Deer
Japan
X Corp
Twitter

More Telugu News