Road Accident: జమ్ము కశ్మీర్ లో 150 అడుగుల లోయలో పడిన వాహనం... ఐదుగురు జవాన్ల మృతి

Five QRT soldiers died in road mishap in Jammu and Kashmir
  • పూంఛ్ సెక్టార్లో ఘోర ప్రమాదం
  • నీలమ్ నుంచి బల్నోయి ఘోరా పోస్ట్ వద్దకు వెళుతున్న సైనికులు
  • వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిన వైనం
  • మృతులు నెంబర్ 11 మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్ కు చెందినవారు
జమ్ము కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూంఛ్ లో ఓ సైనిక వాహనం 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది సైనికులు గాయపడ్డారు. మృతి చెందిన జవాన్లు నెంబర్ 11 మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్ కు చెందినవారు. వీరంతా క్విక్ రియాక్షన్ టీమ్ (QRT) లో సభ్యులు. 

సైనిక వాహనం నియంత్రణ రేఖ వెంబడి ప్రయాణిస్తుండగా, పూంఛ్ సెక్టార్లో ఈ ప్రమాదం జరిగింది. సైనికులు నీలమ్ ప్రాంతంలో ఉన్న స్థావరం నుంచి బల్నోయి ఘోరా పోస్ట్ వద్దకు వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు సహాయచర్యలు ప్రారంభించారు.
Road Accident
Jawans
ORT
Army
Poonch
Jammu And Kashmir

More Telugu News