Bill Clinton: బిల్ క్లింటన్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

USA ex President Bill Clinton hospitalised
  • జ్వరంతో బాధపడుతున్న బిల్ క్లింటన్
  • వాషింగ్టన్ లోని ఆసుపత్రిలో చేరిన మాజీ అధ్యక్షుడు
  • గతంలో బైపాస్ సర్జరీ చేయించుకున్న క్లింటన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వాషింగ్టన్ లోని జార్జ్ టౌన్ యూనివర్శిటీ మెడికల్ ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో ఆయన బాధపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వైట్ హౌస్ నుంచి నిష్క్రమించిన తర్వాత బిల్ క్లింటన్ అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 2004లో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. దీని కారణంగా ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. 2005లో ఊపిరితిత్తుల శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. 2010లో కరోనరీ ఆర్టరీలో స్టెంట్ అమర్చుకున్నారు. ఆ తర్వాత బిల్ క్లింటన్ ఎక్కువగా శాకాహారాన్ని తీసుకుంటున్నారు. దీని కారణంగా బరువు తగ్గడంతో, ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. తాజాగా ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.
Bill Clinton
USA

More Telugu News