IndiGo: ఇండిగో విమానంలో ‘చాయ్ చాయ్’.. వీడియో ఇదిగో!

IndiGo Passenger Serving Chai On Flight Goes Viral Internet Reacts
  • తోటి ప్రయాణికులకు చాయ్ అందిస్తూ నవ్వించిన వ్యక్తి
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
రైలు ప్రయాణంలో చాయ్ చాయ్ అనే అరుపులు వినబడడం సర్వసాధారణం, అదే విమానంలో వినబడితే.. ఛాన్సే లేదంటారా.. నిజమే కానీ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులను సర్ ప్రైజ్ చేస్తూ అందరికీ చాయ్ తాగించాడు. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా తన వెంట తీసుకొచ్చిన ఫ్లాస్క్ లోని టీ ని పేపర్ కప్పుల్లో పోసి అందించాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు సరదాగా నవ్వుకుంటూ టీని ఆస్వాదించారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను ఏకంగా 6.70 లక్షల మంది చూశారు.

కఠినమైన నిబంధనలతో బోరింగ్ గా అనిపించే విమాన ప్రయాణంలో ఇదొక సరదా అనుభవమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆ ప్రయాణికుడిని విమర్శిస్తున్నారు. మంచినీళ్లు సహా విమానంలోకి ఎలాంటి ద్రవ పదార్థాలను అనుమతించరని గుర్తుచేస్తూ.. ఈ ప్రయాణికుడు ఫ్లాస్క్ లో టీ తీసుకెళుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేశారని మరికొందరు నిలదీస్తున్నారు. ‘ఇంట్లో టీ తయారుచేసుకొని తెచ్చుకున్నారు.. వారి టీ వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో తప్పేముంది?’ అంటూ కొంతమంది నెటిజన్లు మద్దతుగా కామెంట్లు పెట్టారు. ‘ఎక్కడైనా, ఎప్పుడైనా సరే ఒక్క మన భారతీయుడు మాత్రమే ఇలా చేయగలడు’ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.
IndiGo
Chai In Flight
Viral Videos
tea

More Telugu News