Transgenders: విధుల్లోకి ట్రాన్స్‌జెండర్‌ కానిస్టేబుళ్లు.. మాక్ డ్రిల్ వీడియో ఇదిగో!

Transgender Traffic Conistables Joined Duty in Hyderabad
--
తెలంగాణ ట్రాఫిక్ విభాగం ఎంపిక చేసిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు సోమవారం విధుల్లో చేరారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రత్యేక నియామకం ద్వారా 39 మంది ట్రాన్స్ జెండర్లను ఉన్నతాధికారులు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి 15 రోజుల పాటు ట్రాఫిక్ విధులకు సంబంధించి అధికారులు శిక్షణ ఇచ్చారు. డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌, ఔట్ డోర్, ఇండోర్‌తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. శిక్షణ పూర్తిచేసుకున్న ట్రాన్స్ జెండర్లతో ఆదివారం జూబ్లీహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం ఆవరణలో డెమో నిర్వహించారు. ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించిన డ్రిల్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Transgenders
Hyderabad
Commissionerate

More Telugu News