Russia: రష్యా విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత... కారణం ఇదే!

Airport in Russia closed
  • రష్యాలోని కజాన్ నగరంపై డ్రోన్లతో దాడి
  • ఎనిమిది డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
  • విమాన రాకపోకలు నిలిపివేత
రష్యాలోని కజాన్ నగరంపై ఈరోజు ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. నగరంలోని పలు నివాస సముదాయాలపై ఎనిమిది డ్రోన్ దాడులు జరిగినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. 

ఈ నేపథ్యంలో కజాన్ లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు రష్యా ఏవియేషన్ 'వాచ్ డాగ్' రోసావియాట్సియా ప్రకటించింది. విమాన రాకపోకలను నిలిపివేసినట్టు తెలిపింది. నివాస సముదాయాలపై జరిగిన దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. 
Russia
Ukraine

More Telugu News