N Ashwini Kumar: జనసేన పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎన్.అశ్వనీ కుమార్ ను నియమించిన పవన్ కల్యాణ్

Advocate Ashwini Kumar appointed as Janasena Party General Council
  • జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం
  • ఎన్. అశ్వనీ కుమార్ నియామకంపై పవన్ కల్యాణ్ నిర్ణయం
  • జనసేన లీగల్ వ్యవహారాలు పర్యవేక్షించనున్న అశ్వనీ కుమార్
జనసేన న్యాయ విభాగానికి సంబంధించి తాజాగా కీలక నియామకం జరిగింది. జనసేన పార్టీ జనరల్ కౌన్సిల్ గా న్యాయవాది ఎన్. అశ్వనీ కుమార్ ను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన నుంచి ఓ ప్రకటన వెలువడింది. పార్టీకి అవసరమైన లీగల్ వ్యవహారాలను అశ్వనీ కుమార్ పర్యవేక్షిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

అశ్వనీ కుమార్ కు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో అనేక కేసులు వాదించిన అనుభవం ఉందని జనసేన వెల్లడించింది. జనసేన పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా న్యాయ పరమైన సేవలు అందిస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.
N Ashwini Kumar
General Council
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News