Bellamkonda Suresh: హిట్ కొట్టిన సినిమా కథ చెప్పి ఆ హీరోయిన్ ను ఒప్పించాను: బెల్లంకొండ సురేష్!

Bellamkonda Suresh Interview
  • 'ఆది' సినిమా తమ బ్యానర్లో పెద్ద హిట్ అని చెప్పిన బెల్లంకొండ 
  • ఆ తరువాత సినిమాకి శ్రియను అనుకున్నామని వెల్లడి  
  • ఆమెను ఒప్పించడం కోసం తాను 'ఆది' కథ చెప్పానని స్పష్టం   
  • శ్రియ వచ్చి చేసిన సినిమా 'చెన్నకేశవరెడ్డి' అంటూ వివరణ

బెల్లంకొండ సురేశ్... నిర్మాతగా అనేక భారీ సినిమాలను అందించారు. రీసెంటుగా ఆయన 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. హీరోయిన్స్ కి వారికున్న మార్కెట్ కంటే నేను ఎక్కువ పారితోషికం ఇస్తాననే టాక్ ఉంది. ఆ సమయంలో ఆ హీరోయిన్స్ కి గల క్రేజ్ ను... నేను నిర్మిస్తున్న సినిమాకి వాళ్లు ఎంతవరకూ అవసరం అనేది దృష్టిలో పెట్టుకునే అలా చేసే వాడిని" అని అన్నారు. 

"తెలుగులో ఒకానొక సమయంలో ఇలియానా చాలా బిజీగా ఉంది. ఒక హీరోతో సినిమా చేయమని అడిగితే చేయనని చెప్పింది. అప్పుడు ఆమె ఒక సినిమాకి 50 లక్షలు తీసుకుంటోంది. నేను కోటి రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతే... వెంటనే ఒప్పేసుకుంది. ఒక్కోసారి ఇలాంటివి చేయక తప్పదు. అలాగే మరో స్టార్ హీరోయిన్... 'ఆది' తరువాత మేము చేసే సినిమాకి డేట్స్ లేవని చెప్పింది. అప్పుడు ఆమె ఢిల్లీలో ఉంది. దాంతో నేను కథ పట్టుకుని నేరుగా అక్కడికి వెళ్లాను.

"నేను వెళ్లేసరికి చాలా ఆలస్యమైంది. ఆ హీరోయిన్... వాళ్ల అమ్మగారు ఇద్దరూ ఉన్నారు. వాళ్లకి కథ చదివి వినిపించాను. కథ చాలా బాగుంది అని చెప్పి వాళ్లు ఒప్పుకున్నారు. అడ్వాన్స్ ఇచ్చి నేను వచ్చేశాను. ఆ తరువాత ఆ హీరోయిన్ వచ్చి ఆ సినిమా చేసేసి వెళ్లిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రియ. నిజానికి నేను ఆమెకి చెప్పింది 'ఆది' కథ. అంతకుముందే మా బ్యానర్లో హిట్ కొట్టిన సినిమా అది. ఆ తరువాత ఆమె వచ్చి చేసింది 'చెన్నకేశవరెడ్డి' సినిమా" అంటూ నవ్వేశారు.

Bellamkonda Suresh
Aadi Movie
Chennakeshava Reddy
Shriya Saran

More Telugu News