indrakeeladri: డిసెంబర్ 21 నుంచి 25 వరకూ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ.. ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ఆలయ అధికారులు

bhavani deeksha 2024 special app for deeksha viramana at indrakeeladri
  • తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాదిగా తరలిరానున్న దీక్షా స్వాములు
  • భవానీ దీక్ష 2024 పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఈవో రామారావు
  • యాప్‌లో 24 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ఈవో వెల్లడి
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాదిగా అమ్మవారికి ఇరుముళ్లు సమర్పించడానికి తరలిరానున్నారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఆలయ పరిధిలోని పూర్తి సమాచారం తెలిసేలా భవానీ దీక్ష 2024 (Bhavani Deeksha 2024)  పేరుతో ప్రత్యేక యాప్‌ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ గురించి ఆలయ ఈవో రామారావు మీడియాకు వెల్లడించారు. 

ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ యాప్‌లో 24 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ఈవో చెప్పారు. భవానీ దీక్ష విరమణ సవ్యంగా, సంతోషంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. 
indrakeeladri
bhavani deeksha
bhavani deeksha 2024 special app
Vijayawada

More Telugu News