Harish Rao: భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం: హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్య

Harish Rao predicts Bhattivikramarka is future cm
  • భవిష్యత్తులో ఆయన సీఎం అవుతారని జోస్యం
  • రూ.7 లక్షల కోట్ల అప్పు చేశామని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేసిందని ఆగ్రహం
  • కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శ
మల్లు భట్టి విక్రమార్క తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆయన సీఎం అవుతారని జోస్యం చెప్పారు. లగచర్ల ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు నల్లటి దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హరీశ్ రావు శాసనసభ ప్రాంగణంలో మాట్లాడుతూ... గత పదేళ్లలో తమ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసినట్టు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ఈ ఒక్క ఏడాదిలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఇలాగే చేస్తూ వెళితే ఐదేళ్లలో రూ.6.36 లక్షల కోట్ల అప్పు అవుతుందన్నారు.
Harish Rao
BRS
Telangana
Mallu Bhatti Vikramarka

More Telugu News