APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్స్ మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt approves Night Out allowance
  • గత వైసీపీ సర్కారు హయాంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం
  • నైటౌట్ అలవెన్స్ తొలగింపు
  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో నైటౌట్ అలవెన్స్ పునరుద్ధరణ
  • వేతనంతో కలిపి ఇచ్చేలా జీవో జారీ
ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు మంజూరు చేసింది. రోజుకు రూ.150 నైటౌట్ అలవెన్స్ ఇచ్చేలా జీవో విడుదల చేసింది. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు వేతనంతో కలిపి నైటౌట్ అలవెన్స్ కూడా అందుకోనున్నారు. 

గతంలో వైసీపీ సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. ప్రభుత్వంలో విలీనం చేశాక నైటౌట్ అలవెన్స్ ను తొలగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్టీసీ తన ఉద్యోగులకు నైటౌట్ అలవెన్స్ చెల్లించనుంది. 

జీవో విడుదల నేపథ్యంలో, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. అరియర్స్ కూడా ఇవ్వాలని ఎన్ఎంయూఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
APSRTC
Nightout Allowance
Chandrababu
TDP-JanaSena-BJP Alliance

More Telugu News