Nara Bhuvaneswari: ఎల్లుండి నుంచి కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneswari will visit Kuppam constituency from Dec 19
  • 4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన
  • 4 మండలాల్లో వివిధ వర్గాలను కలవనున్న సీఎం చంద్రబాబు అర్ధాంగి
  • డీఎస్సీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఎల్లుండి (డిసెంబరు 19) నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. భువనేశ్వరి 4 రోజుల పాటు 4 మండలాల్లో పర్యటించనున్నారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. 

ముఖ్యంగా, డీఎస్సీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చిరు వ్యాపారులకు ఉపయోగపడే తోపుడు బళ్లు, దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేయనున్నారు. భువనేశ్వరి పర్యటన నేపథ్యంలో టీడీపీ  శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
Nara Bhuvaneswari
Kuppam
Chandrababu
TDP

More Telugu News