ind vs aus: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ .. గబ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇదే

ind vs aus australian playing 11 announced for gaba test this bowler who troubled rohit virat is back
  • భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్
  • గబ్బా వేదికగా జరిగే మ్యాచ్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
  • గాయం కారణంగా దూరమైన జోష్ హేజిల్‌వుడ్ మళ్లీ తిరిగి జట్టులోకి
 
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మూడో టెస్ట్ శనివారం జరుగుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతున్న మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. రెండో టెస్ట్‌కు గాయం కారణంగా దూరమైన జోష్ హేజిల్‌వుడ్ మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. హేజిల్‌వుడ్‌ను జట్టులోకి తీసుకోవడంతో స్కాట్ బోలాండ్‌ను పక్కన పెట్టడం జరిగింది. అడిలైడ్ డే - నైట్ టెస్టులో హేజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్‌కు తుది జట్టులో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. 
 
కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. బోలాండ్ అడిలైడ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు అతను గత 18 నెలల్లో బెంచ్‌పైనే ఎక్కువ సమయం గడిపాడని పేర్కొన్నారు. తుది జట్టులో స్థానం దొరికినప్పుడల్లా రాణించాడన్నారు. ఎంసీజీలో నాల్గో టెస్ట్ కు అతను ఆడే అవకాశం ఉందని చెప్పారు. గబ్బా టెస్ట్‌కు ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్  గ్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, హేజిల్‌వుడ్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.  
 
ఈ టెస్ట్ సందర్భంగా క్యూరేటర్ డేవిడ్ సాండూర్‌స్కీ మాట్లాడుతూ మ్యాచ్ కోసం భిన్నమైన పిచ్‌ను సిద్దం చేశారన్నారు. సాధారణంగా సీజన్ ప్రారంభంలో పిచ్‌లు కొంచెం కొత్తగా ఉంటాయని, అదే సమయంలో ఎక్కువ వేగం, బౌన్స్ కలిగి ఉంటాయన్నారు. సాధారణంగా ప్రతిసారి ఇలాంటి పిచ్‌నే సిద్ధం చేస్తామని తెలిపారు. ఇక్కడి పిచ్‌పై వేగంతో పాటు బౌన్స్‌ను రాబట్టవచ్చని పేర్కొన్నారు. 
 
ఇప్పటి వరకూ గబ్బా వేదికపై టీమిండియా ఏడు టెస్ట్‌లు ఆడింది. ఇందులో ఐదింట ఓడిపోగా, ఒక్కసారి విజయాన్ని నమోదు చేసింది. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. 2021లో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆస్ట్రేలియాను భారత్ జట్టు ఓడించింది. 
ind vs aus
Cricket
Sports News

More Telugu News