Allu Arjun: అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలింపు!

Police shifting Allu Arjun to Chanchalguda jail
  • సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు
  • బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • చంచల్ గూడ జైలు వద్ద భారీగా మోహరించిన పోలీసులు
సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 

అల్లు అర్జున్ ను తరలించిన నేపథ్యంలో చంచల్ గూడ కాగారారం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు. వారందరినీ పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బన్నీని జైలుకు తరలిస్తున్న రహదారిలో పోలీసులు రోడ్డు క్లియరెన్స్ చేస్తున్నారు.
Allu Arjun
Tollywood
Jail

More Telugu News