Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్... కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త

Revathi husband
  • జరిగిన ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేదన్న భాస్కర్
  • అల్లు అర్జున్ పై కేసును విత్ డ్రా చేసుకునేందుకు రెడీగా ఉన్నానని వ్యాఖ్య
  • బన్నీ అరెస్ట్ విషయాన్ని మొబైల్ తో న్యూస్ చూస్తూ తెలుసుకున్నానని వెల్లడి
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'పుష్ప-2' సినిమా చూడాలని తన కొడుకు అడిగితే సంధ్య థియేటర్ కు తీసుకెళ్లానని భాస్కర్ తెలిపారు. జరిగిన దానితో అల్లు అర్జున్ కు సంబంధం లేదని చెప్పారు. అల్లు అర్జున్ పై తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని... ఆసుపత్రిలో తన మొబైల్ లో న్యూస్ చూస్తూ ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. తన కొడుకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు.
Allu Arjun
Tollywood
Revathi
Husband

More Telugu News