Vishwak Sen: జాతిరత్నాలు దర్శకుడితో విష్వక్సేన్ 'ఫంకీ' చిత్రం ప్రారంభం

Vishvaksens Funky movie with Jati Ratnala director
  • విష్వక్సేన్ హీరోగా 'ఫంకీ'  సినిమా ప్రారంభం 
  • అనుదీప్‌ దర్శకత్వంలో మరో ఎంటర్‌టైనర్‌ 
  • జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం
'జాతిరత్నాలు' వంటి హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకున్న అనుదీప్‌ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటి వరకు మాస్‌ సినిమాలు చేస్తూ వచ్చిన హీరో విష్వక్సేన్ కథానాయకుడిగా అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ తాజా చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఫంకీ' అనే గమ్మతైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి నాగవంశీ క్లాప్‌ నివ్వగా, కళ్యాణ్‌ శంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత నాగవంశీ బౌండెడ్‌ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. 

ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ కూడా అందర్ని ఆకట్టుకుంటోంది. 'ఫంకీ' టైటిల్‌తో పాటు ఈ సినిమా జానర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలిసేటట్లుగా పోస్టర్‌ డిజైన్‌ చేసిన విధానం బాగుంది. పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో విష్వక్సేన్ పాత్ర మునుపెన్నడు చూడని విధంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

2025 జనవరి నుంచి రెగ్యులర్‌ను షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సురేష్‌ సారంగం 
Vishwak Sen
Anudeep K.V
Funky
Naga Vamsi
Sithara Entertainments

More Telugu News