YS Jagan: వైఎస్ జ‌గ‌న్ తాడేప‌ల్లి ఇంటిలో వాస్తు మార్పులు!

Architectural changes at Tadepalle Palace of YS Jagan
  • రాజ‌కీయంగా, కుటుంబ ప‌రంగా స‌మ‌స్య‌ల‌కు వాస్తు దోషాలు కూడా కార‌ణ‌మ‌నే భావ‌న‌లో జ‌గ‌న్‌ 
  • ఈ నేప‌థ్యంలోనే తాడేప‌ల్లిలోని ఇంటి వాస్తు మార్పులకు శ్రీకారం 
  • ఇటీవ‌లే నివాసానికి ద‌క్షిణ దిశ‌లో ఉన్న కంచె తొలగింపు
  • ఇప్పుడు ఈశాన్యం వైపు కూడా మార్పులు చేయిస్తున్న మాజీ సీఎం
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ఓట‌మితో కంగుతిన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ తిరిగి పార్టీ బ‌లోపేతానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల కుటుంబ గొడ‌వ‌లు కూడా జ‌గ‌న్‌ను చికాకు పెట్టిన విష‌యం తెలిసిందే. దాంతో రాజ‌కీయంగా, కుటుంబ ప‌రంగా స‌మ‌స్య‌ల‌కు వాస్తు దోషాలు కూడా కార‌ణ‌మ‌ని భావిస్తున్న ఆయ‌న తాజాగా త‌న తాడేప‌ల్లి ‌ఇంటిలో వాస్తు మార్పుల‌పై దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. 

దీనిలో భాగంగా ఇటీవ‌లే నివాసానికి ద‌క్షిణ దిశ‌లో ఉన్న కంచెను తొలగించ‌గా.. ఇప్పుడు ఈశాన్యం వైపు కూడా మార్పులు చేయిస్తున్నట్లు స‌మాచారం. తూర్పు, ఈశాన్యం మూసి ఉంచ‌డం శుభ‌సూచ‌కం కాద‌న్న పండితుల అభిప్రాయం మేర‌కు జ‌గ‌న్ తాడేప‌ల్లి ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. 
YS Jagan
Tadepalle Palace
Andhra Pradesh
YSRCP

More Telugu News