Chandrababu: బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్' ఆడిన చంద్రబాబు, నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

Chandrababu and Nara Lokesh participates in Tug Of War in Bapatla High School
  • ఏపీలో నేడు మెగా పేరెంట్-టీచర్ సమావేశం
  • బాపట్లలో జరిగిన సమావేశానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు
  • టగ్ ఆఫ్ వార్ లో గెలిచిన చంద్రబాబు టీమ్
ఇవాళ ఏపీ వ్యాప్తంగా 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో నిర్వహించిన ఈ తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో సరదాగా గడిపారు. 

చంద్రబాబు, లోకేశ్ ఈ హైస్కూల్లో టగ్ ఆఫ్ వార్ ఆటలోనూ పాల్గొన్నారు. చంద్రబాబు ఓవైపు తాడును పట్టుకోగా... నారా లోకేశ్ మరోవైపు తాడును పట్టుకుని బలప్రదర్శన చేశారు. చంద్రబాబు లాగిన వైపే మొగ్గు కనిపించింది. దాంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు.
Chandrababu
Nara Lokesh
Tug Of War
Bapatla High School
Mega Parent-Teacher Meeting
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News