Orlando: జాయ్ రైడ్ లో మరణించిన బాలుడు.. తల్లిదండ్రులకు రూ. 2.6 వేల కోట్ల పరిహారం

Parents Awarded Rs 2600 Crore After Son Falls To Death At Orlando Park Ride
  • అమెరికా కోర్టు సంచలన తీర్పు
  • రైడ్ తయారీ, నిర్వాహక కంపెనీకి భారీ పెనాల్టీ
  • భద్రత విషయంలో జవాబుదారీతనం కోసమేనని కోర్టు వ్యాఖ్య
పార్క్ లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ బాలుడు భారీ టవర్ పైనుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో జాయ్ రైడ్ తయారీ సంస్థతో పాటు నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందని నిర్ధారించిన కోర్టు భారీ జరిమానా విధించింది. మరణించిన బాలుడి తల్లిదండ్రులకు 310 మిలియన్ డాలర్లు (రూ.2,624 కోట్లు) చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. రైడ్ తయారీ సమయంలో భద్రతకు పెద్ద పీట వేయడం, జవాబుదారీతనం కోసమే ఈ తీర్పు వెలువరించినట్లు వ్యాఖ్యానించింది.

ఘటన పూర్వాపరాలు ..
ఓర్లాండోలోని ఐకాన్ పార్క్ కు స్థానిక స్కూలుకు చెందిన ఫుట్ బాల్ టీమ్ సభ్యులు వెళ్లారు. పిల్లలంతా అక్కడి రైడ్ లను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే టైర్ సాంప్సన్ (14) అనే బాలుడు ఫ్రీ పాల్ రైడ్ ఎక్కాడు. నిబంధనల ప్రకారం 129 కిలోల లోపు బరువున్న వారినే రైడ్ ఎక్కేందుకు అనుమతించాలి. సాంప్సన్ మాత్రం 173 కిలోల బరువున్నాడు. అయినప్పటికీ నిర్వాహుకులు అతడిని రైడ్ కు అనుమతించారు. సాంప్సన్ లావుగా ఉండడంతో సీటు బెల్ట్ సరిగా ఫిట్ కాలేదు.

దీంతో టవర్ పైకి వెళ్లాక అది ఊడిపోయి సాంప్సన్ కిందపడి చనిపోయాడు. దీనిపై సాంప్సన్ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. పార్క్ నిర్వాహకులతో పాటు ఫ్రీ పాల్ తయారీదారుల నిర్లక్ష్యం ఉందని కోర్టు నిర్ధారించింది. నిర్వాహకులు, తయారీదారులలో జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో సాంప్సన్ తల్లిదండ్రులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.
Orlando
Florida
America
Park Ride
Compensation
Boy Dead

More Telugu News