Sandhya Theater Incident: సంధ్య థియటర్ వద్ద మహిళ మృతిపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు

Complaint to NHRC on woman death at Sandhya Theater in Hyderabad
  • డిసెంబరు 4వ తేదీ రాత్రి హైదరాబాదులో పుష్ప-2 ప్రీమియర్ షో
  • సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్
  • భారీ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి
  • తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు
  • రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలన్న న్యాయవాది రవికుమార్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడం... భారీ తొక్కిసలాట జరిగి రేవతి (39) అనే మహిళ మృతి చెందడం తెలిసిందే. తాజాగా, ఈ ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ(జాతీయ మానవ హక్కుల సంఘం)కి ఫిర్యాదు అందింది. 

పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ప్రీమియర్ షో వేశారని... ఈ సినిమా హీరో అల్లు అర్జున్ పైనా, అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ రవికుమార్ అనే న్యాయవాది ఎన్ హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును ఎన్ హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది.

కాగా, సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, తొక్కిసలాట జరగకుండా కట్టడి చేయలేకపోయిందని న్యాయవాది రవికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించిందని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. మహిళ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ ఎన్ హెచ్ఆర్సీని కోరారు.
Sandhya Theater Incident
Woman Death
NHRC
Allu Arjun
Pushpa-2
Hyderabad

More Telugu News