K Kavitha: కవిత, హరీశ్ రావు హౌస్ అరెస్ట్

Kavitha and Harish Rao house arrest
  • పార్టీ నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
  • బీఆర్ఎస్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతల గృహనిర్బంధం
బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్ బండ్) లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వారి నివాసాల నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే పద్మారావులను గృహనిర్బంధం చేశారు. 

కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి లను పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డికి నిన్న అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
K Kavitha
Harish Rao
BRS
House Arrest

More Telugu News