భారత్-చైనా సంబంధాలపై లోక్ సభలో జైశంకర్ కీలక ప్రకటన
- ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయని వెల్లడి
- 2020లో చైనా చర్యల కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయన్న జైశంకర్
- ఉద్రిక్తతలు తగ్గించడం కోసం నిరంతరం చర్చలు జరిపినట్లు వెల్లడి
నిరంతర దౌత్య చర్యల ఫలితంగా ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని తెలిపారు. 2020లో ఏప్రిల్-మే కాలంలో తూర్పు లఢఖ్ లోని పలు ప్రాంతాల్లో చైనా భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం ఘర్షణకు దారి తీసిందని లోక్ సభలో తెలిపారు. ఓ వైపు మన బలగాలతో చైనాకు దీటుగా స్పందిస్తూనే... మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించడం కోసం డ్రాగన్ కంట్రీతో చర్చలు జరిపినట్లు తెలిపారు.
సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం లేకుండా రెండు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రాలేవని మన ప్రభుత్వం చైనాకు స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో మనకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.